Babu Mohan : ఒకప్పుడు కమెడీయన్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన బాబు మోహన్ ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చారు. అయితే ఇన్నాళ్లు బీజేపీలో ఉన్న బాబు మోహన్ ఇప్పుడు ప్రజా శాంతి పార్టీలో చేరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని… ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ స్పష్టం చేశారు. ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ… తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని, బాబు మోహన్ తెలంగాణలోని వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పారు.
తాజాగా కేఏ పాల్ పోటీపై బాబు మోహన్ మరోసారి స్పందించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్‌కు 805 ఓట్లు రాగా, 2019లో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి అని అన్నారు. పాల్ ఆహ్వానం మేరకే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు చెప్పారు. వైజాగ్ ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎంపికైతే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఆయన ఎంపీ అయితే, ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చి రాష్ట్ర దేశ అప్పులు తీర్చుతారని చెప్పారు. పైగా, ఆయన దేవుని దూత అని చెప్పాు. అందువల్ల కేఏ పాల్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని, బీజేపీ గత ఐదు సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుందని విమర్శించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో తన పేరు లేకుండానే కేంద్రానికి పంపారని చెప్పారు.దేశం బాగుపడలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏ పాల్‌తో కలసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు బాబుమోహన్ తెలిపారు. కేఏ పాల్ నేతృత్వంలో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి, రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.