Babar Azam : భారీ అంచనాలతో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టిన భారత్ సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం మీడియాతో మాట్లాడాడు. లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లలో కేవలం నాలుగు గెలిచి, ఐదింట్లో ఓడిన పాక్ టీమ్.. సెమీస్ చేరకుండానే ఇంటికెళ్లిపోయింది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ తమను బాగా చూసుకున్నారని, చాలా మద్దతిచ్చారని బాబర్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఒడిన తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీ ప్రమాదంలో పడటంతోపాటు ఆ టీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఇండియాలో లభించిన ఆతిథ్యంతోపాటు తన బ్యాటింగ్ వైఫల్యం, తొలిసారి ఇండియాలో అడుగుపెట్టిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇండియా నుంచి తమకు చాలా మద్దతు, ప్రేమ లభించాయి. నేను సరిగా టోర్నీని ముగించలేకపోయాను. బ్యాటింగ్ లో రాణించడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. 50 లేదా 100 కొట్టాలని అనుకోలేదు. టీమ్ ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వ్యక్తిగత ప్రదర్శన కాదు.. జట్టు విజయానికి సాయం చేసే ప్రదర్శన చేయాలనుకున్నాను. పరిస్థితులను బట్టి నేను నెమ్మదిగా ఆడాను. వేగంగా ఆడాను. టీమ్ అవసరాలను బట్టే ఆడాను” అని బాబర్ తెలిపాడు.ఇక్కడెలా ఆడాలో అవగాహన లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నించాం. ఇక్కడెలా బ్యాటింగ్ చేయాలన్నదానిపై ఓ ప్లాన్ రూపొందించుకున్నాం.
మొదట్లో, చివర్లో పరుగులు వస్తాయి. మధ్యలో బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు కాస్త కష్టమవుతుంది” అని బాబర్ అన్నాడు. ఇక ఈ వరల్డ్ కప్‌లో ఎవరు విజేత అనే దానిపై కూడా సమాధానం ఇచ్చాడు. ఇండియా లేదా ఆస్ట్రేలియాలలో ఒక జట్టు తప్పక ట్రోఫీ అందుకుంటుందని జోస్యం చెప్పాడు బాబర్. ఇక వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ సెమీఫైనల్ కూడా చేరకపోవడంతో ఆ టీమ్ పై, కెప్టెన్ బాబర్ ఆజంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అతని కెప్టెన్సీ కూడా తీసేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే షాహిన్ ఆఫ్రిది, బాబర్ మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ ప్రచారం నడుస్తుంది.