OTT Horror Web Series : ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్‌లకి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తోన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీసెంట్‌గా ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అభిమానులతో పంచుకున్నది. లీడ్ రోల్స్ ఎవరు అనేది చెప్పకుండా కేవలం షాడోను మాత్రమే చూపిస్తూ డిఫరెంట్‌గా డిజైన్ చేసింది పోస్టర్. ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుండగా, ఈ సిరీస్‌లో వేదిక , మంచు లక్ష్మి , రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సిరీస్ లో వచ్చే ప్రతి హారర్ ఎలిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు.యక్షిణి వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.డీ గ్లామర్ లుక్‌లో వేదిక క్యారెక్టర్ ఈ సిరీస్‌లో వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. హారర్ అంశాలతో ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్‌ను పంచుతోందని చెబుతోన్నారు. ఇందులో ప్రతి పాత్ర మిస్టీరియస్‌గా ఉంటుందని సమాచారం.
ఈ బ్యానర్ వచ్చిన బాహుబలి, బాహుబలి 2తో పాటు మర్యాదరామన్న, వేదం సినిమాలు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవడం మనం చూశాం.. పరంపరం, అన్యాస్ ట్యుటోరియల్‌తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ నిర్మించారు. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్‌తో రెండు పాన్ ఇండియన్ సినిమాలను ఆర్కా మీడియా సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి యక్షిణి పేరుతో వెబ్ సిరీస్ నిర్మిస్తుండగా, ఇది ఎలాంటి సంచలనం విజయం సాధిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…