టీ 20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ.. మండిపడుతున్న ఫ్యాన్స్, మీడియా..!

టీ 20 వరల్డ్‌ కప్‌ 2022లో చాలా జట్లు అంచనాలకు మించి రాణిస్తుంటే.. కొన్నిజట్లు మాత్రం అంచనాలను గల్లంతు చేస్తున్నాయి. అలాంటి జట్లలో ముందువరుసలో ఉంది ఆస్ట్రేలియా. అఫ్గాన్‌పై గెలిచిన తర్వాత వారి సెమీస్‌ ఆశలు ఇంగ్లాండ్‌ చేతుల్లో ఉన్నాయి. అయితే ఆఖరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ను లాక్కొచ్చి ఎలాగో శ్రీలకంపై ఇంగ్లాండ్‌ జట్టు విజయం సాధించింది. నిజానికి న్యూజిలాండ్- ఇంగ్లాండ్‌- ఆస్ట్రేలియాలకు సమానంగానే పాయింట్లు ఉన్నా కూడా.. నెట్‌ రన్‌రేట్‌ లో చాలా తేడా ఉంది. ఇంగ్లాడ్‌ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియా ఎలిమినేట్ ‌అయిపోయింది. ఆస్ట్రేలియా ఓటములకు పునాది న్యూజిలాండ్‌ వేసింది. తొలి మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టింది.

ఆ తర్వాత శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్నే నమోదు చేసింది. కానీ, మూడో మ్యాచ్‌ మాత్రం వర్షార్పణం అయ్యింది. అది గెలిచుంటే ఆస్ట్రేలియాకు ఒక పాయింట్‌ ఎక్కువే ఉండేది. కానీ, వర్షం కూడా వీరి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఐర్లాండ్‌ లాంటి జట్టుపై 42 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసినా కూడా.. ఆఫ్గనిస్తాన్‌ జట్టు మాత్రం ఆస్ట్రేలియా నెట్ రన్‌ రేట్‌పై గట్టి దెబ్బే కొట్టింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి పరుగు ఆస్ట్రేలియాని సెమీస్‌కు దూరం చేశాయి. శ్రీలంక గెలుపు కోసం లంక అభిమానుల కంటే ఆస్ట్రేలియా అభిమానులే ఎక్కువగా ఎదురుచూశారు. ఒకానొక దశలో శ్రీలంక గెలుస్తుందేమోనన్న ఆశ కూడా లంక అభిమానుల్లో కలిగింది.

australian media and fans angry after their cricket team failure

అయితే.. ఒక్క ఫోర్‌తో క్రిస్ ఓక్స్ లంక అభిమానుల ఆశలతో పాటు ఆస్ట్రేలియా సెమీస్ ఆశలపై కూడా నీళ్లు చల్లాడు. అయితే ఈ పరాజయం పట్ల జట్టు ఎలా స్పందించినా ఆస్ట్రేలియా ఫ్యాన్స్, మీడియా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఆస్ట్రేలియా మీడియా జట్టుని ఫాస్ట్ అండ్ బ్రూటల్ అంటూ తీవ్రంగా విమర్శించింది. నిజం చెప్పాలంటే, ఆసీస్ నిజంగా సెమీస్‌కు చేరుకోవడానికి ఎప్పుడూ అర్హులు కాదు అని ది ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక పేర్కొంది. గత 30 ఏళ్లలో ఏ ఫార్మాట్ లో అయినా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే. అందులోనూ ఇప్పుడు ఆతిథ్య జట్టుగా, డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఘోరపరాభావం మూట కట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Share
Usha Rani

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago