Atchennaidu : టీడీపీ, జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూ ఉన్నాం. సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ కు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు..రెండు లోక్ సభ సీట్లు ఖాయం కానున్నాయి అని తెలుస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్దమయ్యారు. ఇద్దరూ కలిసి భారీ సభ నిర్వహణకు నిర్ణయించారు. బీజేపీతో పొత్తు పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అందరి చూపు టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా మీదనే ఉంది. కేవలం ఈ ఇరువురి పార్టీల అభిమానులు మరియు క్యాడర్ తో పాటుగా, వైసీపీ క్యాడర్ కూడా టీడీపీ – జనసేన అభ్యర్థుల లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది.
సంక్రాంతి పండగ నాడు అభ్యర్థుల జాబితా బయటకి వస్తుందని ఇది వరకే నాదెండ్ల మనోహర్ పలు సందర్భాల్లో తెలిపాడు. కాని అప్పుడు రాలేదు. తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన మధ్య మంచి ఒప్పందం జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి మంచి చర్చలు చేసుకుంటున్నాయి. ఈ నెల 8వ తారీఖుకి ఒక క్లారిటీ వస్తుంది. టీడీపీ పార్టీ 45 ఏళ్ల పార్టీ. ఎప్పటి నుండో ప్రజలకి మంచి చేస్తూ ఉంది. జగన్ మాదిరిగా మేము మారుస్తూ ఉండం. ఎనిమిదో తేది వరకు మాకు పక్కా ఓ క్లారిటీ అయితే వస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
చంద్రబాబు- పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చలలో జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని.. వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…