Atchannaidu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్‌డెవలెప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఏపీలో టీడీపీ కేడర్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. బాబుతో నేను అంటూ ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ప్రెస్‌నోట్ వైరల్ అయ్యింది. ఆ నోట్‌లో టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నేతలపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా హెచ్చరించినట్లు ఉంది. అయితే ఈ నోట్ ఫేక్ అంటూ అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై అచ్చెన్నాయుడు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో ఆయన్నే అడగాలన్నారు. నన్నడిగితే నేనేం చెబుతానంటూ విసుక్కున్నారు. తామెవర్నీ స్పందించాలని బతిమిలాడటం లేదని, అడగడం లేదని చెప్పారు. స్వచ్ఛందంగా అందరూ తమకు తామే చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా స్పందిస్తున్నారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారని అన్నారు అచ్చెన్నాయుడు. తామవెర్ని స్పందించాలని అడగబోమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై టీడీపీలో ఓ వర్గం మండిపడుతోంది. మరోవర్గం ఆయనకు జరిగిన అవమానంపై సింపతీ చూపిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ గుర్తు రాడు, అదే టీడీపీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయన కావాల్సివచ్చాడా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. కనీసం చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే తీరిక అయినా జూనియర్ కి లేదా అని అడుగుతున్నారు ఇంకొందరు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడి స్పందన మాత్రం మరింత రచ్చలేపింది.ఇక ఇదిలా ఉంటే..అచ్చెన్నాయుడు పేరుతో వైరల్ అవుతున్న నోట్‌లో ‘ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్ చేసిన విషయం మీకు విదితమే. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా “బాబుతో నేను” అనే రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…