Venu Swamy : వేణు స్వామీ.. ఏమిటీ ర‌చ్చ స్వామీ..?

Venu Swamy : రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జోత్యిష్యం చెబుతూ వార్త‌ల‌లో నిలిచే వేణు స్వామి ఆ మ‌ధ్య మ‌ళ్లీ ఎవ‌రి జోలికి రాన‌ని చెప్పాడు. కాని ఆ మాట‌ల‌ని ప‌క్క‌న పెట్టేశాడు. అక్కినేని నాగచైతన్య ,శోభిత ధూళిపాళ్ల పెళ్లయిన కొన్నాళ్లకు విడిపోతారని ఇద్దరి గ్రహ మైత్రి సరిలేదని, నిశ్చితార్థం జరిగిన సమయం కూడా అనుకూలంగా లేదని, ఈ కారణాలతో వారు విడిపోతారని జోస్యం చెప్పారు. సమంతతో విడిపోయినట్లే, శోభితతో కూడా చైతన్య విడిపోతాడని ఆయన సెలవవ్వడంతో అభిమానులు, నెటిజన్లు వేణుస్వామిని ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా మాట యుద్దాలు చేశారు. ఇదే విషయంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వేణుతో ఫోనులో మాట్లాడటంతో ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

“రెండు నెలల క్రితమే రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జాతాకలు చెప్పనని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే నాగచైతన్య, శోభిత జాతకం గురించి చెప్పడానికి కారణం ఉంది. గతంలో సమంత, చైతన్య గురించి చెప్పాను, దానికి కొనసాగింపు అన్నట్లు ఇది చెప్పాను. ఇదే విషయంపై మంచు విష్ణు ఫోన్లో మాట్లాడారు. ఇకపై సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పనని, సంబంధిత వీడియోలో పోస్ట్‌ చేయనని చెప్పాను. ఆయన కూడా పాజిటవ్‌గా తీసుకున్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీల జ్యోతిష్యాలు ఆశించవద్దు’ అని వీడియోలో పేర్కొన్నారు. క‌ట్ చేస్తే గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి.

astrologer venu swamy facing real problems now
Venu Swamy

అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి. నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు. నేను నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని అన్నారు.దీనిపై మూర్తి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లో కూడా కేసు న‌మోదు చేశారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌గా మార‌డంతో అంద‌రు వేణు స్వామినే తిట్టిపోస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago