App : చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించి అదరిని ఆశ్చర్యపరిచాడు అసోం యువకుడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ‘అటోమేటిక్’ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది.ఇంతకు ఆ యువకుడు ఎవరు, ఆ యాప్ ఏంటనే కదా మీ డౌట్.. అయితే మేటర్‌లోకి వెళదాం. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌ను తయారుచేశాడు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్‌లలో ఉన్న కాంటాక్ట్స్‌తో ఈ యాప్‌ను ఉపయోగించి మెసేజ్‌లు చేసుకోవచ్చు.
అయితే ఈ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇతని టాలెంట్‌తో టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేయడం విశేషం. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్‌కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.
అయితే చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా అసోం యువకుడిగా మారాడు.. ప్రస్తుతం అతనిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. అతని టాలెంట్‌ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి భారతీయుడు కావడం గర్వంగా ఉందని అన్నారు. ప్రస్తుతం అసోం యువకుడికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, అతనిపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురుస్తున్నారు.
https://youtube.com/watch?v=3n7a1ipU22w