Arnab Goswami : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు ఇప్పుడు నేషనల్ మీడియాలో మార్మోగిపోతోంది. శుక్రవారం రాత్రి రిపబ్లిక్ టీవీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వివరాలపై ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ చర్చించిన తీరు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్నాబ్‌తో డిబేట్ అంటే రాజకీయ నేతలు ముందుకు రారు. ఎందుకంటే ఆయన కఠినమైన, విచిత్రమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అందుకే ఆయనతో లైవ్ డిబేట్ అంటే కొంత వెనకడుగు వేస్తారు. ఇటీవల చంద్రబాబుకు సీమెన్స్ సంస్థ ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డిని ఆర్నాబ్ గోస్వామి అడగ్గా.. ఆయన నీళ్లు నమిలారు.
ఇక ఇప్పడు చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా లోకేష్ ఎంతో ధైర్యం చేసి ఆర్నాబ్‌తో చర్చలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు కొంత ఇబ్బందులు పడ్డారు. అసలు టెండర్లే లేకుండా రూ.370 కోట్లు అడ్వాన్ గా ఎందుకు పేమెంట్ చేశారు..? ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు జమచేయకముందే.. ప్రభుత్వ వాటా కింద 10% భాగం నగదును ఎందుకు ముందే జమ చేశారు..? ముందే సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్ధలతో డీల్ కుదుర్చుకుని, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి, టెండర్ లేకుండా నిధులు రిలీస్ చేశారా..?
ఈ ఒప్పందం సరిగ్గా లేదని ఆర్థిక శాఖ ప్రిన్సపల్ సెక్రటరీ చెప్పినా మీరు వినకుండా ఎందుకు నిధులు మంజూరు చేశారు అంటూ ఆర్నాబ్ గట్టి ప్రశ్నలు వేసే సరికి లోకేష్ కు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఆయన నీళ్లు నములుతూ అలా కూర్చున్నాడు. ఇక్కడ పప్పు అనిపించుకుంటున్న లోకేష్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మరీ పరువు పోగొట్టుకున్నాడని కొందరు అంటున్నారు. లోకేష్ పరువు తెలుగు రాష్ట్రాల్లో పోయింది సరిపోదా.. ఢిల్లీకి వెళ్లి మరీ పరువు తీసుకోవాలా అంటూ అడుగుతున్నారు. ఇలాంటి నాయకుడిని మనం నమ్ముకుంటే మన పరువు కూడా పోతుందేమో అని భయడపుతున్నారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్ కన్నా అంతో ఇంతో బాలయ్యే బెటర్ అని అంటున్నారు.