Aparichitudu Movie : ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్‌లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ తన సినిమాల్లో ఎంటర్టైనమెంట్‌తో పాటు ఒక మంచి సోషల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ఈయన తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘అపరిచితుడు’ ఒకటి. నిర్లక్ష్యం, లేజినెస్, అవినీతి , కల్తీ వలన దేశం ఎలా అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతుందో అనే కాన్సెప్ట్‌తో శంకర్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.
అపరిచితుడు చిత్రంలోశంకర్ స్క్రీన్‌ప్లే గాని, టేకింగ్ గాని నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. మూడు విభిన్న పాత్రల్లో విక్రమ్ నటన వర్ణనాతీతం అనే చెప్పాలి.. ఈ సినిమాతోనే విక్రమ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అసలు ఈ సినిమా కథను శంకర్ మొదట రజినికాంత్‌కు వినిపించాడట. కానీ రజిని ఈ కథను రిజెక్ట్ చేయడంతో విక్రమ్ వద్దకు అపరిచితుడు స్క్రిప్ట్ వెళ్ళింది. విక్రమ్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. సదా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. చిత్రంలో మూడు పాత్రలలో ఒకటి రాము…మరొకటి రెమో..మూడో పాత్ర అపరిచితుడు.
రాము ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఉండలేడు. కానీ చాలా సౌమ్యుడు రూల్స్ గురించి మాట్లాడుతుంటాడు. ఇక రెమో లవర్ బాయ్…అంతే కాకుండా అపరిచితుడు అన్యాయం చేసే వాళ్లను ఎదిరిస్తూ వాళ్ల అంతు చూస్తాడు. అయితే రాము సినిమాలో చాలా రూల్స్ మాట్లాడుతూ చిన్న తప్పు కూడా అస్సలు భరించడు. లాయర్ కావడంతో ఓ సారి బైక్ వైర్ తెగితేనే ఆ కంపెనీని కోర్టుకు లాగుతాడు. కానీ సినిమాలో రాము బండి నడిపేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోడు. మరి అంత రూల్స్ మాట్లాడే రాము హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనే విషయంపై నెటిజన్స్ తప్పు పడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…