Anshu : నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం మన్మథుడు.ఈ చిత్రంలో మహేశ్వరీ పాత్రలో నటిస్తూ హీరోయిన్ గా పరిచయమైన నటి ‘అన్షు అంబానీ’. ఆ మూవీలో తన నటన, అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఆ తరువాత శివాజీ ‘మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అయితే మన్మథుడు సినిమాతో కథానాయికగా పరిచయమైన ‘అన్షు’ .. తన గ్లామర్ తో చాలా కాలం పాటు కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది. యూత్ అనుకున్నవారంతా ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు.
రాఘవేంద్ర మూవీ టైంలోనే ‘సచిన్ సగ్గర్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసారు. ఇప్పుడు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే చేసిన రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్షు.. సడన్ గా ఎందుకని యాక్టింగ్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఇదే విషయాన్ని అన్షుని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆమె బదులిచ్చారు.ఇండస్ట్రీని వదిలేసిన 20 ఏళ్ల తరువాత వచ్చాను. ఎందుకు వదిలేశాను అని ఆలోచన చేసుకుంటే, చిన్నతనం కావడం వలన .. ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడం వలన .. చదువు పూర్తికాకపోవడం వలన అనే నాకు అనిపిస్తోంది. ‘మన్మథుడు’ సినిమా చేసే సమయానికి నాకు 16 ఏళ్లు మాత్రమే. ఆ సినిమా చేయడం నాకు ఇప్పటికీ ఒక కలగానే అనిపిస్తూ ఉంటుంది” అని అన్నారు.
‘మన్మథుడు’ తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత నేను ఇంగ్లండ్ వెళ్లిపోయాను. అప్పట్లో ఆ విషయం చాలామందికి తెలిసే అవకాశం కూడా లేదు. నేను చనిపోయానని కూడా అనుకున్నారట. అది తెలిసి నాకు భయం వేసింది కూడా. అప్పటికీ ఇప్పటికీ తెలుగు సినిమా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా ఫ్లాట్ ఫామ్స్ వచ్చాయి కూడా. పిల్లలు కూడా పెద్దవాళ్లు కావడం వలన మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను” అని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…