Anil Kumar Yadav : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్.. కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ చేసేది ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. తాజాగా పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ అని విమర్శించారు. జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు అని పవన్ పై ధ్వజమెత్తారు మంత్రి రోజా.
ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోట్లు కొల్లగొట్టిన వ్యక్తికి అండగా నిలబడుతున్నారంటే మీరెంటనేది అర్ధమవుతుంది. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? ముద్రగడ పద్మనాభంకు ఎందుకు అండగా నిలబడలేదు? అని పవన్ ను నిలదీశారు. ప్యాకేజీ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నాడు. సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కోసం ప్రాణం ఇస్తా అని తెగ కోతలు కోస్తాడు. మరి అలాంటి చిరంజీవిని టీడీపి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన నోరు ఎందుకు మెదపలేదు అంటూ అనిల్ మండిపడ్డారు.
చంద్రబాబు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నారు. సీఐడీ చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా? అమిత్ షా, మోదీలతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా. ఇందులో కక్ష సాధింపు లేదు. సినిమాలో మాత్రమే పవన్ హీరో. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అని విమర్శించారు. తప్పు చేసింది చంద్రబాబు. ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు. దాని ఈడీ, ఐటీ, కేంద్రం నోటీసులు ఇచ్చాయి. సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది. అంతేకానీ ఇందులో కక్షసాధింపు చర్య ఎక్కడుంది? మాట్లాడే ముందు ఒకసారి పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి అని మండపడ్డారు అనీల్ కుమార్.