Anil Kumar Yadav : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వచ్చే ఎన్నికలు యుద్ధ వాతావరణంలో జరగనున్నాయని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలు 70 ఏళ్ళు వెనక్కి వెళతారని హెచ్చరించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకి కోర్టు బెయిల్ ఇస్తే న్యాయం గెలిచింది అంటూ ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.
మరోవైపు కొందరు నేతలు ఓటీపీలు అడుగుతున్నారు. దీంతో పర్సనల్ ఇన్‌ఫర్‌మేషన్ హ్యాక్ అవుతుంది. ఓటీపీ గురించి అడిగితే ఎవరినైన అరెస్ట్ చేయించాల్సి ఉంది. మీకు ఏ సమస్య అయిన ఉంటే బీఎల్ఏలతో చేయించకోవాలి.అంతేకాని సంబంధం లేని వ్యక్తులు వెళ్లి ఓటీపీలు అడిగితే వారిని బొక్కలో వేసి కేసు పెడతామంటూ అనీల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
కొంత మంది వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి అక్రమ మైనింగ్ చేస్తూ అందరిని బెదిరింపులు చేస్తుండొచ్చని.. టీడీపీ నేతలే అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాను అన్నారు. ప్రస్తుతం అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలు 70 ఏళ్ళు వెనక్కి వెళతారని హెచ్చరించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకి కోర్టు బెయిల్ ఇస్తే న్యాయం గెలిచింది అంటూ ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి అనిల్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అనిల్ స్పందించారు.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను కొద్దిరోజులుగా నియోజకవర్గంలో లేనని.. కానీ ఎన్నికలకు కొంత సమయమే ఉంది కాబట్టి మళ్లీ యాక్టివ్ అవుతాను అంటున్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని.. తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అన్నారు.