Anil Kumar Yadav : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా హోరాహోరీగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా ఏ జిల్లాలో యాత్ర చేస్తుంటే ఆ ప్రాంత వైసీపీ నేతను టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల నెల్లూరు జిల్లా లో పాదయాత్ర కొనసాగించిన క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు, ఆరోపణలు చేశారు. వీటిపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. లోకేశ్ విమర్శలకు కౌంట్ ఇస్తునే సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో నా గెలుపును ఆపు చూద్దాం.. నెల్లూరు సిటీ లో నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.
తనను సిల్లీ బచ్చా అంటున్న నారా లోకేష్ అదే సిల్లీ బచ్చాతో దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేసి గెలవాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. తన కుటుంబానికి చరిత్ర లేకున్నా జగన్ అన్న ఆశీస్సులతో మంత్రినయ్యానని, మీ తాత, నాన్న సీఎం లు అయినా ఎమ్మెల్యే కాలేక పోయావంటూ లోకేష్ ను అనిల్ ఎద్దేవా చేశారు. నేనా – నువ్వా సిల్లీ బచ్చా? అని ప్రశ్నించారు. ఇక తాజాగా అనీల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ మాట్లాడిన ఓ డైలాగ్ పట్టుకొని విమర్శలు చేశారు. ఎవరైన హిందీ టూ తెలుగు లేదంటే ఇంగ్లీష్ టూ తెలుగు ట్రాన్స్ లేటర్ పెట్టుకుంటారు.
కాని నారా లోకేష్ మాట్లాడిన తెలుగుకి తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకోవల్సిన పరిస్థితి. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్ధం కావడం లేదు. సాధారణంగా ఎవరైన భయం నా బ్లడ్ లో లేదు, జీన్స్ లో లేదు. కాని లోకేష్ మాత్రం బయోడేటాలో లేదు అంటున్నాడు. అస్సలు బయోడేటాలో భయం అనే కాలమ్ ఉంటుందా అంటూ సెటైర్స్ వేశారు. చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగు భరింలేక జనం మీదకు వదిలేశారు. ఇది భరించలేక జనాలు చస్తున్నారు అంటూ సెటైర్స్ వేశాడు. ప్రస్తుతం లోకేష్ పై అనీల్ సెటైరికల్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.