Angelo Mathews Vs Shakib Al Hasan : నిన్న జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగగా ఈ మ్యాచ్‌లో బంగ్లా..శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరిగిన సమయంలో ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీనిపై క్రికెట్ నిపుణులు, నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి వాదనలకు దిగుతున్నారు. అయితే టైమ్డ్ ఔట్ గురించి మ్యాచ్ అనంతరం మ్యాథ్యూస్ స్పందించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. షకీబుల్ హసన్, బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు చాలా అవమానకరం. వారు ఇలాగే క్రికెట్ ఆడాలని అనుకుంటే.. అది చాలా తప్పు. చాలా అవమానకరం. ఈ రోజు వరకూ షకీబ్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని మొత్తం అతను పోగొట్టుకున్నాడు, మా దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని బయటపెడతాం”.. అంటూ మ్యాథ్యూస్ అన్నాడు.
ఇంత పెద్ద వివాదం జరిగాక టైమ్డ్ ఔట్ పై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా కొంతమంది, చాలామంది వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్ అయ్యాక మ్యాచ్ ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్ స్టాక్ రూల్స్ గురించి వివరణ ఇచ్చాడు. ఏమన్నాడంటే… ఎంసీసీ క్రికెట్ చట్టాల ప్రకారం అయిటే టైమ్డ్ ఔట్ కు సమయం 3 నిమిషాలు. కానీ ఐసీసీ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం అది 2 నిమిషాలే. కొత్తగా వచ్చే బ్యాటర్ 2 నిమిషాల్లోగా బాల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ప్రతి వికెట్ పడ్డప్పుడు థర్డ్ అంపైర్ ఈ సమయాన్ని మానిటర్ చేస్తుంటాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లకు సమాచారాన్ని చేరవేస్తుంటాడు. రీసెంట్ మ్యాచ్‌లో.. మ్యాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోక ముందే నిర్ణీత 2 నిమిషాల్లో బాల్ ఎదురుకునేందుకు సిద్ధంగా లేడు. అప్పుడు ఫీల్డింగ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. ఔట్ ఇచ్చారు.హెల్మెట్ ఇష్యూ రాకముందే మ్యాథ్యూస్ తన 2 నిమిషాలు వాడేశాడని అంపైర్లు చెప్తున్నారు.

ఇన్నింగ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే సమస్య ఉండేదు కాదు. కానీ అప్పుడే పెవిలియన్ నుంచి ఫ్రెష్ గా వస్తూ… ఎక్విప్ మెంట్ అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోకపోవడం ఓరకంగా మ్యాథ్యూస్ తప్పే. 2011 ప్రపంచకప్ లో కూడా ఆడిన సీనియర్. అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఔట్ అవడం ఏంటని అనిపిస్తోంది. ఈ వివాదంలో కొందరు షకీబ్‌కి మద్దతు ఇస్తుండగా, మరి కొందరు మాత్రం మాథ్యూస్‌ని సపోర్ట్ చేస్తున్నారు.