Anchor Suma : బుల్లితెర యాంకర్ సుమ అంటే ప్రత్యేకమైన అభిమానం, అంతకు మించిన స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె దాదాపు 10 మార్గాల ద్వారా ఇన్ కమ్ ను సంపాదిస్తుంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను కూడా ప్లాన్ చేస్తుంది. అంతేనా సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేస్తూనే, ఆమె తన సొంత యూట్యూబ్ ఛానల్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఆమె తన యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ తో ఎక్కువ ఇన్ కమ్ ను సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆమె ఛానెల్ ను ఎక్కువగా ఫారెన్ కంట్రీస్ లో ఉన్నవాళ్లు చూస్తున్నారట.
అమెరికా, వేరే దేశాల్లో ఉన్నవాళ్లు యూట్యూబ్ తో సుమ ప్రోగ్రామ్స్ చూడటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఒక్కో ప్రోగ్రామ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే సుమకు యూట్యూబ్ తో వచ్చే ఆదాయం సరిపోతుందా అనే రేంజ్ లో కొంతమంది ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె చేసే వీడియోలతో ఫ్యూచర్ లో కూడా ఎక్కువ డబ్బు వస్తుందనే ఉద్దేశ్యంతో ఇప్పట్నుండే ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అయితే సుమ తన యూట్యూబ్ ఛానెల్ నుండి నెలకు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు ఇన్ కమ్ వస్తుందట.
ఇప్పుడు చాలామంది సెలెబ్రిటీలు ఇప్పుడు తమ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటూ వ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్ ను ప్లాన్ చేస్తూ.. ఎంచక్కా సంపాదించేస్తున్నారు. ఓ వైపు తమ ప్రొఫెషనల్ రెమ్యునరేషన్స్ తో పాటు, మరో వైపు తమ పర్సనల్ ఇన్ కమ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. అలాగే సుమ కూడా తన యూట్యూబ్ ఛానెల్ తో బాగానే సంపాదిస్తుంది. పైగా ఈ ఛానెల్ కోసం ఆమె ఎక్కువ టైమ్ ను, కంటెంట్ ను ఖర్చు చేయక్కర్లేదు. నార్మల్ తన టిప్స్, కుకింగ్, పర్సనల్ విషయాలు ఇలా షేర్ చేసుకుంటుంది.