Anchor Jhansi : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ యంకర్స్‌లో ఒకరిగా ఉంది ఝాన్సీ. పలు షోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఝాన్సీ సినిమాలలో కూడా నటించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను, పర్సనల్ విషయాల గురించి మాట్లాడింది. నాకు లక్షల్లో డబ్బులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. చెక్ పై మూడు నెలల ముందు డేట్ వేసి మోసం చేసినవారు ఉన్నారు. నాతో చాలా సన్నిహితంగా ఉంటూ, నా కాన్సెప్ట్ లు ఓకే కానివ్వకుండా చేసినవారు ఉన్నారు. అయినా ఎందుకు ఇలా చేశారని నేను ఏరోజు అడగలేదు అని ఝాన్సీ పేర్కొంది.
నాకు అన్యాయం చేసినవారికి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది .. అది నాకు తెలుసు. నా శాపం ఎంతగా తగులుతుందనేది నాతో రెండు రోజులు కేరక్టర్ చేయించుకుని పీకేసిన వారికి తెలుసు. ఒక పెద్ద హీరో .. పెద్ద డైరెక్టర్ .. రెండు రోజులు కేరక్టర్ చేశాను .. నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ ఆ తరువాత ఆ పాత్ర కోసం వేరే ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. నిజంగా అది నాకు అవమానమే. దాంతో నా శాపము గట్టిగా తగిలింది .. మళ్లీ ఇంతవరకూ కోలుకోలేదు అని చెప్పింది. ఇక నన్ను చాలా షోల నుండి అర్థాంతరంగా తీసేశారు. రావాల్సిన ఫేమ్ రాకుండా చేశారు. 24 ఎపిసోడ్స్ చేస్తే 25వ షో నుండి తీసేశారు. 99 షోలు నేను చేస్తే 100వ షో నుండి తప్పించారు. నేను కాంట్రాక్టు ముగిశాక మాత్రమే వెళ్ళిపోతాను. ఏ రోజు మధ్యలో తప్పుకోలేదు అని ఝాన్సీ తెలియజేసింది.
ఒక షోకి సంబంధించిన మేకర్స్ డబ్బులు ఇవ్వడం లేదని ఫైనల్ ఎపిసోడ్స్ చేయనని మిగతా వాళ్ళు పట్టుబట్టడంతో, పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన మ్యాటర్ అని నేను వాళ్ళను ఒప్పించి షో పూర్తి చేయించాను. అప్పుడు అందరికి డబ్బులు ఇచ్చి నాకు ఇవ్వలేదు. మూడు నెలల ముందు డేట్ వేసి చెక్ ఇవ్వగా, అది బౌన్స్ అయింది. నన్ను మోసం చేసిన వాళ్లతో నేను మరలా పని చేశాను. కాకపోతే డిస్టెన్స్ మైంటైన్ చేస్తాను. జస్ట్ హాయ్ బై అన్నట్లు ఉంటాను. నాకు డబ్బులు ఇవ్వని వాళ్ళు నా ముందు సిగ్గుతో చచ్చిపోవాలి, అంటూ ఝాన్సీ కీలక కామెంట్స్ చేశారు. పరిశ్రమలో నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. మనం సహాయం చేసినవాళ్లు మోసం చేశారు. నాతో పని చేయడం ఇష్టం లేదన్న వాళ్ళు నా దగ్గరి వచ్చారు. అదే నా గెలుపు… అని ఝాన్సీ చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…