Anasuya : జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. కెరీర్ మొదట్లో న్యూస్ రీడర్‌గా పని చేసిన అనసూయ ఆ తర్వాత యాంకర్‌గా మారి ఇప్పుడు నటిగానూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. రంగమ్మత్తగా అనసూయ అభినయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రస్తుతం నటిగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్‌తో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కించడం హాబీగా పెట్టుకుంది. అయితే.. అవే ఫొటోస్‌పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టడం కొందరు పనిగా పెట్టుకున్నారు.
ఇటీవల తనని ఆంటీ అంటూ ట్రోల్స్ చేసే వారికి గట్టిగా బదులిచ్చింది. ఇక ఇండస్ట్రీలో పరిస్థితులపై కూడా కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆడవాళ్లంటే.. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే కెమెరా ముందు కాపాడండి అని అనాలి.. లేదంటే సిగ్గుపడి నవ్వాలి. జస్ట్ అంతే. అంత వరకే మా డ్యూటీ. అసలు మాట్లాడకూడదు. గిల్లితే గిల్లించుకోవాలని పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా.. హీరోయిన్స్ పరిస్థితి అంతే. ఆడవాళ్లు అంటే ఇలాగే ఉండాలి. మేం ఇక్కడ దేవదాసీల్లాగా పనిచేయాలి. అది చాలా రాంగ్.
మీలాగే మేం కూడా మా పని మేం చేస్తున్నాం.. మా జీతాలు మేం తీసుకుంటున్నాం. థియేటర్‌కి వచ్చే వాడికి నా సినిమా చూసే అర్హత ఉందా లేదా ? అని మేం కూడా మొదలుపెడితే ఎవడొస్తాడు థియేటర్‌కి. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. నేను మాట్లాడకుండా ఉన్నా సరే.. నా వైపు వేలెత్తి చూపించిన వాళ్లు ఉన్నారు.. అని చెప్పుకొచ్చింది అనసూయ. అయితే కొద్ది రోజుల క్రితం క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా ఈ అమ్మడు స్పందించింది. ఎవరైనా రోల్ ఆఫర్ చేసి అడగకూడనిది అడిగితే.. ఆ పాత్ర వదులుకోడమే. అది కాకపోతే దాని అమ్మలాంటి పాత్ర వస్తుంది. అవకాశం కోసం అలా పిలిస్తే వెళ్లేదే లేదు. ధైర్యం లేని అమ్మాయిలే ఇలా క్యాస్టింగ్ కౌచ్‌కి బలవుతున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…