Anam Venkata Ramana Reddy : ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు. 2006లో రూ.లక్షతో ప్రారంభించిన సాక్షి మీడియా ఇప్పుడు వేల కోట్ల లాభం ఎలా పొందగలిగిందని నిలదీశారు. ఆ చిట్కా ఏదో ఇతరులకు చెబితే బాగుంటుందని సూచించారు. సాక్షి మీడియాలో తనకు సగం వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆ క్రమంలో ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.
సాక్షి మీడియా తనది కాదని సీఎం జగన్ అప్పుడప్పుడు అంటుంటారు. ‘సాక్షి ఎవరిదీ..? నీదు కాదు, నీ భార్య భారతికి సంబంధం లేదు, నీ కూతుళ్లకు వాటా లేదు. నీ బావ మరిది దినేశ్ రెడ్డికి చెందింది కాదు.. ఇంతకి సాక్షి మీడియా ఎవరిదీ..? అని’ అనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను 2006లో ప్రారంభించారని ఆనం వెంకట రమణారెడ్డి గుర్తుచేశారు. రూ.లక్షతో ప్రారంభించామని చెబుతారు. విజయసాయిరెడ్డి రూ.30 వేలు, జగన్ రూ.30 వేలు, కామత్ రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని వివరించారు. 2007 వరకు సాక్షి డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నారు. తర్వాత జగన్, ఆయన తర్వాత వైఎస్ భారతి డైరెక్టర్లుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 2015వరకు డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. రూ.లక్ష పెట్టుబడితో మొదలైన సాక్షి సంస్థ ఇప్పుడు వేల కోట్లకు పడగలేత్తిందని విమర్శించారు.
ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడుతుందని తెలిపారు.ఐదేళ్లపాటు షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఉంచితే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, హస్తం గుర్తు, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మరిచి పోలేదని చెప్పారు.అలాగే తమపై అనర్హత వేటు వేసే అంశంలో స్పీకర్ కు సజ్జల ఫోన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…