Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో రోజా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఆర్‌కే రోజా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక మనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారని… కానీ తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని రోజా ఆవేదన వ్యక్తం చేసింది.. అయితే ప్రస్తుతం రోజాకి సినీ ఇండస్ట్రీ నుండి చాలా మద్దతు లభిస్తుంది. మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసే దుర్మార్గులు బయట తిరగకూడదని.. బండారు సత్యనారాయణమూర్తికి తానేంటో చూపిస్తానని రోజా సవాల్ చేశారు.
ఇకపై ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తానన్నారు రోజా. ఈ క్రమంలో ఆనం స్పందించారు. 25 రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, బ్రహ్మణిల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు మాట్లాడుతున్నారని. చంద్రబాబు ఆర్ధిక ఉగ్రవాదని పదే పదే చెబుతున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డే ఆర్ధిక ఉగ్రవాదని సీబీఐ చెబుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి అన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇతర కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయని, ఇది సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టిన నివేదికని అన్నారు. ఇప్పుడు ఎవరు ఆర్థిక ఉగ్రవాదో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు.
సాక్షిలో అక్రమంగా పెట్టిన రూ.1256 కోట్లు ప్రజల సొమ్ము కదా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు వాళ్ళ నాయకుడు గురించి తెలుసుకోవాలని, వైఎస్సార్ ఎన్నికల ఆఫీడవిట్లో రూ.2.12 కోట్లు అని చూపించారని.. 2009 ఎన్నికల్లో ఆఫీడవిట్లో జగన్ రూ.70 కోట్ల ఆస్తి ఉన్నట్లు చూపించారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రూ.90 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టారు… ఇంత సొమ్ము ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దాదాపు 5 లక్షల పేపర్ల కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు చెల్లిస్తుంది. దీంతో పాటు ప్రకటనల పేరుతో రూ.400 కోట్ల నుంచి, రూ.500 కోట్లు చెల్లించారని.. దీన్ని మోసం అంటారా?.. దొంగతనం అంటారా?.. లేదా వాలంటైన్ బహుమతి అంటారా? అని ప్రశ్నించారు. ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతోంది ఐఏఎస్ అధికారులు కాదని, సాక్షి పత్రికలో పని చేసిన మాజీ ఉద్యోగులు నడుపుతున్నారని, వారికి ఇచ్చే జీతం ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. సాక్షి పత్రికపై సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అసలు ఆ పార్టీ నాయకులకు దాని అర్ధం తెలుసా. అని ప్రశ్నించారు. ఎవరు గజ దొంగ, ఎవరు వైట్ కాలర్ దొంగ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.