Ammoru Movie : ఒక సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతగా కష్టపడుతుంటారనే విషయం మనకు తెలిసిందే. ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. ఒకసారి ఔట్ పుట్ సరిగ్గా రాలేదని తెలిస్తే మళ్లీ రీషూట్‌కి కూడా వెనకాడరు.భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇలా రీషూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సౌందర్య ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ తెరకెక్కించిన అమ్మోరు చిత్రాన్ని రీషూట చేశారట. అమ్మోరు చిత్రం ఆ టైంలోనే మంచి గ్రాఫిక్స్ తో, మైథలాజికల్ ఫాంటసీతో రూపొందింది. 1992 లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న అయినవిల్లి ప్రాంతంలో మొదలైన ఈ సినిమా 1995 లో విడుదలైంది.
శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సినిమాని ఒక కోటి 80 లక్షల బడ్జెట్ తో తీశారు. సౌందర్య ఈ సినిమా కోసం 40వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ సినిమాలోని ప్రతి ఎమోషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. వడివుక్కరసి నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ పాత్రకి మొదటి ఛాయిస్ వడివుక్కరసి కాదు. సీనియర్ యాక్ట్రెస్ నాగమణి , కాని తర్వాత వడివుక్కరసిని పట్టుకొచ్చారు. అలాగే రామిరెడ్డి పోషించిన పాత్రలో మొదట నటుడు చిన్నా నటించారు.
మూడు నెలలో సినిమా షూటింగ్ పూర్తి కాగా, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కి అవుట్ పుట్ అంత బాగా అనిపించలేదు. దాంతో రీషూట్ చేశారు. అప్పుడు చిన్నా పాత్రలో రామి రెడ్డిని, నాగమణి పాత్రలో వడివుక్కరసిని రీప్లేస్ చేసి షూట్ చేశారు. అలా అమ్మోరు సినిమా షూటింగ్ రెండు సార్లు జరిగింది. ఈ క్రమంలో చిత్రం రిలీజ్ కావడానికి టైం పట్టింది. సౌందర్యకు 3వ సినిమాగా షూట్ ప్రారంభమైన ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి 27వ సినిమా అయ్యింది. అంటే ఆ గ్యాప్ లో సౌందర్య 24 సినిమాలు పూర్తిచేసిందన్నమాట. ఈ సినిమాకంటే ముందే గ్రాఫిక్స్ ఉన్న విఠాలాచార్య సినిమాలు, భైరవద్వీపం సినిమా వచ్చినప్పటికీ ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ మూవీ మాత్రం ఇదే.
ఇక ఈ మూవీ 2 వారాలు జస్ట్ యావరేజ్ అనిపించేలానే రన్ అయినా తర్వాత విశ్వరూపం చూపించి ఏకంగా రూ.11 కోట్ల వరకు షేర్ ని రాబట్టగా తమిళ్ లో డబ్ అయినప్పుడు రూ.1 కోటి గ్రాస్ ని, ఇతర భాషలు, హిందీలో కలిపి మరో రూ.2 కోట్ల షేర్ ని మొత్తం మీద రూ.13.5 కోట్ల షేర్ తో ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…