Amit Shah : దేశంలో ఏపీ ఎన్నికలు సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాయి. ఎన్నికల ప్రచారం మొదలైనప్పపటి నుండి అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ అనేక చర్చలు నడిచేవి. ఇక కౌంటింగ్ సమయం సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసం తో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో ఎన్నికల సరళి పైన పూర్తి సమాచారం సేకరించిన బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. ఏపీలో ఫలితం పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో గెలువబోతోందని జోస్యం చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలోనే కాకుండా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టు పేర్కొన్నారు. ఒడిశాలో 16-17 స్థానాల్లో గెలువబోతున్నామని, ఏపీలో 17, పశ్చిమ బెంగాల్‌లో 24 నుంచి 32 స్థానాల వరకు ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని వివరించారు.
తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ గతం కంటే రెండు శాతం పెరగటం తమకు కలిసొచ్చే అంశంగా టీడీపీ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేసారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…