Ambati Rayudu : ప్రస్తుతం ఏపీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి పోతారా అనే ఆసక్తి అందరిలో ఉండగా ఇప్పుడు అంబటి పవన్ కల్యాణ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది.ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన రాయుడు.. జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా తెలిపారు రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మరో ట్వీట్ చేశారు.
త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు.. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కొద్దిరోజుల్లోనే పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు రాయుడు. ఏపీలో అధికార వైసీపీ తరపున పొలిటికల్ గేమ్ అడేందుకు రెడీ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రాకు రాయుడు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీఎం జగన్ కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్‌కు అప్పుడే బ్రేక్ పడిపోయింది. అంబటి పొలిటికల్ మ్యాచ్ ప్రారంభం కాకముందే జగన్ టీమ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు పవన్ ని కలవడం వెనక కారణం ఏంటా అని అందరిలో ఆసక్తి నెలకొంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…