Ambati Rambabu : ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన అన్నట్టు వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ తెగ రచ్చ చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి అని అపశకునలే ఎదురయ్యాయని ఆరోపించారు. కుప్పంలో యాత్ర మొదలు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని పేర్కొన్నారు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదని విమర్శించారు. కనీసం పాదయాత్ర సభలో ఏం మాట్లాడాలో తెలియడం లేదని అన్నారు. కొడుకు కోసం చంద్రబాబు, అల్లుడు కోసం బాలకృష్ణ నానా తంటాలు పడుతూ పనన్ కల్యాణ్ సహకారం తీసుకుంటున్కారని ఆరోపించారు.
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కొందరు అధికారులు, పోలీసుల పేర్లను నారా లోకేశ్ ఓ ఎర్ర పుస్తకంలో రాసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. “ఎర్ర బుక్ అంట. అందులో పేర్లు రాసుకున్నాడంట. ఆ బుక్ ఒరిజినల్ కాపీని వాళ్ల నాన్న గారికి ఇస్తాడంట… ఒక కాపీ తన వద్ద ఉంచుకుంటాడంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కు కూడా ఇవ్వవయ్యా! పవన్ కల్యాణ్ యాంకర్ గా వస్తున్నాడు కదా… ఆయనకు కూడా ఇస్తే బాగుంటుంది! ఆయన కూడా నీ భాగస్వామే అన్నావుగా.
![Ambati Rambabu : అసమర్ధ కొడుకు కోసం వృద్ధ తండ్రి పాట్లు.. అంబటి నాన్‌స్టాప్ సెటైర్స్ Ambati Rambabu non stop counters to nara lokesh and chandra babu](http://3.0.182.119/wp-content/uploads/2023/12/ambati-rambabu.jpg)
నీ దుంపతెగ… తెలుగుదేశం పార్టీ తెల్లజెండా ఎత్తేంత వరకు మన లోకేశ్ బాబు నిద్రపోయేట్టు లేడు! తెల్లజెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు! నేను ఎప్పుడో చెప్పాను… లోకేశ్ బాబు ఒక ఐరన్ లెగ్. అతడు కాలు పెట్టాడు… తెలుగుదేశం కుంగింది… యువగళం పాదయాత్ర చేశాడు… తెలుగుదేశం ఇంకా కుంగింది” అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, చంద్రబాబు భలే యాంకర్లను సెట్ చేశాడంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.