Ambati Rambabu : సీనియర్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ వచ్చాక రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్‌ని విమర్శిస్తూ వస్తున్నారు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో ఏదో రకంగా వార్తల్లో నిలిచే ఆయన ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పవర్ కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను టార్గెట్ చేశారు. ఎన్నికల సందర్భంగా పదే పదే తమ పార్టీ పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు.అంతే కాదు తమ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి పక్కాగా సీఎం కాబోతున్నాడంటూ ప్రకటించారు. ఛాలెంజ్ కూడా విసిరారు. ఆయన చెప్పినట్టుగానే రెండూ జరిగాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది. తనకు స్నేహితుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొలువుదీరారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన దోపిడీ, అక్రమాల గురించి శ్వేత పత్రం విడుదల చేసింది. దీనికి విరుద్దంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించారు బండ్ల గణేష్. పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఎందుకు అంటూ ప్రశ్నించారు. గులాబీ నేతలపై పంచ్ లు విసిరారు.ఇలా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతూనే ఉన్నారు.
మరోవైపు వైసీపీ నాయకులపై కూడా తనదైన శైలిలో పంచ్ లు వేస్తూనే ఉంటారు.వారిపై ఏదో రకమైన విమర్శలు చేస్తుంటారు. రీసెంట్‌గా బండ్ల తిరుమల వెళ్లగా అక్కడ ఆయనకి మంచి గౌరవం దక్కింది. ఆయనకి ప్రత్యేకంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అయితే బండ్ల వస్తున్న సమయంలో పలువురు వైసీపీ నాయకులు ఆయనకి ఎదురు పడగా, వారు బండ్లకి చేతులు ఎత్తి నమస్కరించారు. ఇది చూసి మా బండ్లన్న రేంజ్ ఇలానే ఉంటుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…