Ambati Rambabu : బ్రో మూవీ ఇప్పుడు రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తుంది. చిత్రంలో శ్యాంబాబు పాత్రతో అంబటి రాంబాబుని కించపరిచారంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంబటి రాంబాబు కూడా వరుస ప్రెస్ మీట్‌లతో బ్రో మూవీకి సంబంధించిన పలు విషయాలు తెలియజేస్తున్నారు. పవన్ బ్రో సినిమాలో పాలిటిక్స్ పెట్టి తమను గిల్లాడు అందుకే తాము మాట్లాడుతున్నామన్నారు. బ్రో సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఆయన చెప్పాలని..ఎంత ఇచ్చారనేది నిర్మాతైనా చెప్పాలన్నారు. సినిమా రెమ్యునరేషన్ గురించి చెప్పని వ్యక్తి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని రాంబాబు విమర్శలు గుప్పించారు.
పవన్ నిజాయితీ గురించి మాట్లాడుతారు కానీ నిజాయితీ పరుడు కాదన్నారు. బ్రో సినిమాలో నాపై సెటైర్లు వేశారు కాబట్టి తాను మాట్లాడుతున్నా అన్నారు. వేరే సినిమాల గురించి తాను మాట్లాడడం లేదు కదా అన్నారు. బ్రో సినిమా పెద్ద డిజాస్టర్ అంటూ కూడా అంబటి చెప్పుకొచ్చారు. మొత్తానికి బ్రో సినిమా రాజకీయాలలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇక ఇదలా ఉంటే బ్రో మూవీతో పాటు సినీ పరిశ్రమపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌ను గాలి మాటలుగా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ పేర్కొన్నాడు.
బ్రో మూవీలో పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్ర అంబటిరాంబాబును పోలి ఉందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై అంబటి స్పందించారు. తనను కించపరచాలనే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ …శ్యాంబాబు క్యారెక్టర్‌ను పెట్టాడని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇచ్చిన డబ్బుతోనే విశ్వప్రసాద్ బ్రో సినిమా తీశాడంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తే దర్శకరచయితలకు తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని అన్నడు అంబటి.అయితే అంబటిని ఉద్దేశించి శ్యాంబాబు క్యారెక్టర్‌ను తాము సినిమాలో పెట్టలేదని నిర్మాత విశ్వప్రసాద్ అన్నాడు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ జూలై 28న థియేటర్లలో విడుదలైంది.