Ambati Rambabu : ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించాడో అప్పటి నుండి ఆయనపై విమర్శల దాడి జరుగుతుంది. ప్రజలని, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లని పవన్ మోసం చేస్తున్నాడంటూ వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. రీసెంట్‌గా అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబును జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్..నాడు ముద్రగడ ను అరెస్ట్ చేసినా..మ్యాన్ హ్యాండిలింగ్ చేసినా కనీసం ఖండించారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మనోహర్ ను నమ్ముకొని వెళ్తున్నాడు సముద్రంలోకే వెళ్తారంటూ అంబటి పేర్కొన్నారు. అభిమానులు పవన్ ను సీఎం కావాలని కోరుకుంటుంటే జనసేనాని మంత్రి ఎన్ని సీట్లు ఇస్తారంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేసారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి సానుభూతి ఇచ్చే అంత తెలివి తక్కువ వాళ్లమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా..లేకున్నా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని..చట్టం తన పని తాను చేసుకుపోతోందని అంబటి అన్నారు. చంద్రబాబు కు సానుభూతి అనేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కొందరు చంద్రబాబును సమర్ధిస్తున్నార ని..వారు కూడా త్వరలోనే అసలు విషయం తెలుసుకుంటారని విశ్లేషించారు. టీడీపీ, జనసేన కలిసి రావాలనే తాము కోరుకున్నామని..కలిసి కట్టుగా వారిని ఎన్నికల్లో ఓడించి పంపిస్తామని అంబటి ధీమా వ్యక్తం చేసారు. పవన్ ప్రజల్ని కాకుండా పార్టీ నాయకుల్ని క్యాడర్ ను మోసం చేశారని అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కలిసి వస్తేనే తమకు చాలా మంచిదని అంబటి విశ్లేషించారు. కలవాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానంటూ పవన్ కేడర్ ను మోసం చేసారని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ ఎక్కువ బాధ పడుతున్నారని పేర్కొన్నారు. పవన్ ను నమ్ముకున్న వాళ్లు ఆలోచన చేయాలని అంబటి సూచించారు. పరామర్శకు వెళ్లి పొత్తు ప్రకటన చేసారని .. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ అంటూ అంటి నిప్పులు చెరిగారు. రెండు సున్నాలు కలిసి వస్తే సున్నానే వస్తుంది తప్ప మరొకటి ఉండదు అని అంబటి పేర్కొన్నారు.