Green Peas : మనం అనేక వంటకాలలో పచ్చ బఠాణీలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పన్నీర్ మసాలా, వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో మనం పచ్చి బఠానీలను ఎక్కువగా వాడుతుంటాం. పచ్చ బఠాణీలు నోటికి రుచినివ్వడంతో పాటు ఆరోగ్యనికి కూడా మేలు చేస్తాయి. ఏడాది పొడుగునా లభించే పచ్చిబఠానీ నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చబఠాణీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్ల వంటి పోషకాల యొక్క పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. అలాగే, బఠానీలలోని కౌమెస్ట్రాల్ అని పిలువబడే ఒక అద్భుత పోషకం క్యాన్సర్ రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. విటమిన్ సి, ఇ, జింక్, కాటెచిన్ మరియు ఎపికాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడే రక్షణ కవచాన్ని సృష్టించి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా తయారు చేస్తుంది.
బఠానీలో ఫైబర్ మరియు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. డయాబెటిస్ పేషంట్లలో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రించడానికి పచ్చి బఠానీల అనేది మంచి ఆహారంగా చెప్పవచ్చు. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరుగి మలబద్ధక సమస్య తగ్గుతుంది.
వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలని భావించేవారు పచ్చిబఠానీ తీసుకోవడం వలన బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనం కలిగిన పచ్చిబఠానీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.