మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వంకాయలతో కూర, పచ్చడి, వేపుడు వంటివి తయారు చేస్తుంటారు. అయితే వంకాయలతో వాస్తవానికి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తింటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ లను రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయల్లో ఉండే ఆంథోసయనిన్స్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. వంకాయల్లో పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి.
వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి పోషణ లభిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వంకాయలను తరచూ తింటే రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లు, ఎల్డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రావు. అలాగే వంకాయల్లో ఉండే పాలీఫినాల్స్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే విషయం. ఇక వంకాయలను రెగ్యులర్గా తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే అల్సర్లు ఉన్నా పోతాయి. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.