Amala Paul The Teacher Movie : ఇటీవల ఓటీటీలో చక్కని చిత్రాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఆ క్రమంలో తాజాగా అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ద టీచర్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దేవిక (అమలాపాల్).. ఓ స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది.ఓ రోజు తన ఇయర్ రింగ్ ఎక్కడో పోగొట్టుకుంటుంది. ఇల్లంతా వెతికన దొరకదు. అయితే షటిల్ కోర్ట్ లో తన ఇయర్ రింగ్ దొరుకుతుంది. అది ఇక్కడికి ఎలా వచ్చిందనేది ఆమెకు అస్సలు గుర్తుండదు. మరోవైపు నాలుగేళ్ల నుంచి దేవిక-సుజిత్(హకీమ్ షా) జంట.. పిల్లల కనడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుండగా, ఓ రోజు, దేవిక ఆస్పత్రికి వెళ్లి టెస్టు చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తేలుతుంది.
తన ప్రెగ్నెంట్‌కి భర్త కారణం కాదనుకుని, ఆ విషయాన్ని దాచి పెడుతుంది. మరి అసలు అమలాపాల్ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో పీఈటీ టీచర్ కు మత్తు మందిచ్చి నలుగురు కాలేజ్ కుర్రాళ్లు రేప్ చేస్తారు. కానీ ఆమెకు ఏం గుర్తుండదు. అలాంటప్పుడు ఆమె దాన్ని ఎలా తెలుసుకుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లకు ఎలా బుద్ధి చెప్పింది అనేదే ఈ సినిమా స్టోరీ.ఈ సినిమా క్లైమాక్స్ అయితే సినిమాటిక్ గా అనిపిస్తుంది. నిజంగా ఇలా జరుగుతుందా అనే డౌట్ కూడా ప్రేక్షకులకు వస్తుంది. అమ్మాయిలకు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు భయపడుతూ కూర్చోకుండా ధైర్యం చేసి ముందుకెళ్లాలని అనే మెసేజ్ అందరిని ఆలోజింప చేస్తుంది.
దేవికగా చేసిన అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరచితం. ఆమె తన పాత్రలో అదరగొట్టేసింది. ఫస్టాప్ లో భయం, సెకండాఫ్ లో రివేంజ్ తీర్చుకోవాలనే కోపం చాలా చక్కగా పండించింది. హీరో తల్లిగా కల్యాణి పాత్ర చేసిన మంజు పిళ్లై కూడా అదరగొట్టేసింది. సినిమాని డైరెక్ట్ చేసిన వివేక్.. హార్డ్ హిట్టింగ్ విషయాన్ని చెప్పాలనుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఓవరాల్ గా చెప్పుకుంటే ‘ద టీచర్’ యావరేజ్ సినిమా అని చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఓ సారి చూడొచ్చు.