దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాలు అన్నీ ఇన్నీ కావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు…’ పాటకు గోల్డెన్ గ్లోబ్ సలాం కొట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని మన సినిమా సత్తా చాటింది. అవార్డు ప్రకటించిన తర్వాత రాజమౌళి రియాక్షన్ మాములుగా లేదు. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ట్రిపుల్ ఆర్ టీం దీన్ని చూసి ఎంజాయ్ చేసింది.
అవార్డు రావడంపై ప్రముఖులు ట్రిపుల్ ఆర్ మూవీ టీంకు అభినందనలు చెబుతున్నారు. నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలానే ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అలానే పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. సామాన్య పౌరుడి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు అందరూ గర్వపడుతూ ట్వీట్లు చేయడం విశేషం.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ఆర చిత్ర బృందానికి అల్లు శిరీష్ కూడా తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ‘‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. తెలుగు సినిమా పరిశ్రమ, భారతీయ సినిమా గర్వపడే క్షణమిది’’ అని అల్లు శిరీష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈ ట్వీట్‌లో రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి,ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అల్లు శిరీష్ ట్యాగ్ చేశారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్‌ను మాత్రం ట్యాగ్ చేయకుండా #NTRJr అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు.అయితే ఇది జూనియర్ అభిమానులకి కోపం తెప్పించింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఆయనని ట్రోల్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…