Allu Arjun : సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఇటీవలి కాలంలో రెండు చేతులా సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సినిమాలతో పాటు బిజినెస్‌లు చేస్తుండగా, మరి కొందరు యాడ్స్ లో నటిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ సినిమాతో ఈయనకు నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. ఈయన ప్రమోటర్ గా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని పెద్ద ఎత్తున కంపెనీలు ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా కోకో-కోలా, ఆస్ట్రల్, కేఎఫ్‌సీ, రెడ్ బస్, జొమాటో యాడ్స్ చేశాడు.
కేఎఫ్‌సీ కోసం అల్లు అర్జున్ చేసిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కేఎఫ్‌సీ సంస్థ ఏకంగా ఏడు భాషల్లో అల్లు అర్జున్‌తో యాడ్ చేయించింది. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టైల్లో అదరగొట్టారు. దర్శకుడు క్రిష్ కేఎఫ్‌సీ యాడ్‌కు దర్శకత్వం వహించారు. కేఎఫ్‌సీకి బ్రాండ్అంబాసిడర్గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. విదేశాలకు కూడా తెలుగోడి టాలెంట్‌ను రుచి చూపించారు. దీంతో ఎన్టీఆర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్- 2 ఖరారైంది. దీని కోసం భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
సినిమాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా ఎన్టీఆర్ వెంట పడుతున్నాయి. కొన్నిరోజుల క్రితం తారక్ నటించిన మెక్ డొనాల్డ్స్ యాడ్ విడుదల కాగా, ఈ యాడ్‌లో తారక్ కొత్త లుక్‌లో కనిపించి అలరించారు. అయితే మెక్ డొనాల్డ్ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షరాలా రూ. 8కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. తారక్ కొత్త యాడ్ తమ బిజినెస్‌కు ప్లస్ అవుతుందని భావించినా మెక్ డొనాల్డ్స్ యాజమాన్యం ఎన్టీఆర్ డిమాండ్ మేరకు రెమ్యూనరేషన్ చెల్లించనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు యాడ్స్ కూడా వేటికవే అన్నట్టుగా ఉన్నాయి.