Allu Arjun : తొలి ఓ తెలుగు యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. ఇన్నాళ్ల తెలుగు సినీ చరిత్రలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ దక్కించుకొని రికార్డు సృష్టించారు. ఆ సంతోషాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతేకాదు ఈ సారి అత్యధికంగా పది అవార్డులు తెలుగు సినిమాకి దక్కాయి. దీంతో అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు నటుడికి నేషనల్ అవార్డ్ రావడం పట్ల అందరు ఆనందం వ్యక్తం చేస్తూ బన్నీకి విశేషంగా విషెస్‌ల వెల్లువ కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే బన్నీ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
జాతీయ అవార్డ్ సాదించినక్రమంలో బన్నీని విష్ చేయడానికి ప్రయత్నించగా.. కాసేపు ఉండండి.. నేను ఈ విషయం నమ్మలేకపోతున్నాను అంటూ.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య స్నేహారెడ్డిని పట్టుకుని ఏడ్చేశాడు బన్నీ. తన పిల్లలనుదగ్గరకు తీసుకుని ముద్దాడాడు. తన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు తండ్రిని ముద్దాడి తన సంతోషాన్ని వెల్లడించాడు. ఈసందర్భంగా పుష్పాటీమ్ బన్నీని విష్ చేశారు. ఈక్రమంలో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేశాడు. పుష్ప సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడంపట్ల సంతోషాన్ని వ్యాక్తం చేశారు.
ఇక బన్నీకి ఇండస్ట్రీకి సంబంధించి ఎందరో ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ఇక బన్నీ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఊరమాస్ డైలాగ్ డెలివరీ మాత్రం కాదు బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పెర్ఫాన్స్ తో కేక పెట్టించాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.