Allu Arjun : అనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబీ’. యూత్ పుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ప్రస్తుతం బేబి మూవీ రూ.50 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఇందులో వైష్ణవి, అనంద్, విరాజ్ నటన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ మూవీపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక, మారుతీ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వర్షం కురిపించారు. రీసెంట్గా బేబీ మూవీ టీమ్ అప్రిసియేషన్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.
బన్నీ మాట్లాడుతూ.. బేబి’ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసిందంటూ ముందుగా వారికి థాంక్స్ చెప్పి తన స్పీచ్ కొనసాగించారు. ‘బేబి టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్. సినిమాతో చింపేశారు. నిజానికి లవ్‌లో పెయిన్ చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘కాదల్ కొండేన్, 7/G బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ఇష్టం. కానీ అలాంటి సినిమాలు తీయడమే కష్టం. రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కష్టపడి ఈ స్టోరీ రాసి, సినిమాగా మలిచిన సాయిరాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది’ అన్నారు బన్నీ.
ఇక చిత్ర కథనాయిక వైష్ణవి గురించి చెబుతూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక తెలుగు హీరోయిన్ ఇంత అద్భుతంగా నటిస్తుందని అనుకోలేదు. వైష్ణవిని ఇన్సిపిరేషన్ తీసుకొని చాలా మంది తెలుగు హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి రావాలి అని బన్నీ అన్నారు. ఎవరో మనల్ని ఏదో అన్నారని ఏ మాత్రం నిరుత్సాహం చెందొద్దు. సాయి రాజేష్ గారు ఎవరికో కథ చెప్పడానికి వెళ్తే.. ఇంతకుముందు స్పూఫ్ సినిమాలు చేశారని ఎగతాళి చేశారట. ఎప్పుడు, ఎవ్వడు, ఎక్కడ తిరుగుతారో ఎవ్వరికి తెలియదు. ఫైనల్‌గా ఒక్కటే చెప్తున్నా.. ఒక తల్లి బిడ్డను కనేందుకు ఎంత కష్టపడుతుందో.. మీరు సినిమాకు అంత ఎఫర్ట్ పెట్టారు’ అని సాయి రాజేష్‌ను ఉద్దేశించి అన్నారు బన్నీ.