Allu Arjun Multiplex : ఇటీవల హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి వారు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టగా, ఇప్పుడు అల్లు అర్జున్ టైం వచ్చింది. త్వరలోనే ఏఏఏ అనే పేరుతో మల్లీ ప్లెక్స్ ప్రారంభించనున్నాడు.’పుష్ప’ ఘనవిజయంతో మంచి స్వింగ్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును నిర్మిస్తుండగా, ఇది త్వరలోనే ఓపెనింగ్ అవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ఏషియన్ సత్యం మాల్’ అండ్ మల్టీప్లెక్స్.. త్వరలోనే గొప్ప ప్రారంభం కాబోతోంది అని రాసివుంది.
అయితే థియేటర్ ప్రత్యేకతలు వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ సౌకర్యం ఈ థియేటర్‌లో అందుబాటులో ఉండనుంది. సౌతిండియాలోనే ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ సౌకర్యమున్న రెండో థియేటర్‌గాఈ థియేటర్ ఉండనుండగా, ఇందులో ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను వినియోగించనున్నారు. ఇక అల్లు అర్జున్ వర్చువల్ ఇమేజే ని ఇందులో ఏర్పాటు చేయనుండడం విశేషం. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకి కూడా ఇలా థియేటర్ లో వర్చువల్ ఇమేజ్ లేదు. దీని ముందు నించొని ఎవరు ఎలా చేస్తే ఆ బొమ్మ అలా రియాక్ట్ అవుతుందని సమాచారం.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప.. ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోను ఓ మూవీ చేయనున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రానికి భద్రకాళి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ రానున్న రోజులలో భారీ బడ్జెట్ చిత్రాలే చేయనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…