Allu Arha : పుష్ప తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్దం అవుతున్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణం గడుపుతుంటాడు. ముఖ్యంగా పిల్లలతో కలిసి చిన్న పిల్లాడి మాదిరిగా ఆటలు ఆడుతుంటారు. పిల్లలతో బన్నీ చేసే సందడికి సంబంధించిన వీడియోలని అప్పడప్పుడు స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఫ్యాన్స్ ఈ వీడియోలు చూసిదిల్ ఖుష్ అవుతుంటారు. అర్హ ముద్దు మాటలతో.. అల్లరి పనులతో.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది.
అయితే సోమవారం అల్లు అర్హ 6వ పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన ముద్దుల కూతురు.. గారాల పట్టి అల్లు అర్హకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అర్హకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియొలో అర్హ.. వాళ్ల జుట్లులో కందిరీగలు దూరాయి.. కుడుతున్నాయ్.. అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కనిపించింది. ఎక్కడా అంటే.. అక్కడా అంటూ అర్హా మాట్లాుడుతుంటే.. బన్నీ ముచ్చటపడుతూ.. కూతురిని గారాబం చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసి బన్నీ అభిమానులే కాక నెటిజన్స్ సైతం తెగ మురిసిపోతున్నారు.

స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. స్టార్ కిడ్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పిల్లలు ఇప్పుడు ఏం చేసిన వైరల్ అవుతుంది. సినిమాలలోకి రాకముందే వారు సెలబ్స్ గా మారారు. అర్హ విషయానికి వస్తే ఆమె శాకుంతలంలో నటించింది. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఇక మొన్నటి వరకూ టాలీవుడ్ , మాలీవుడ్ కే పరిమితం అయిన బన్నీన క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు..పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. పుష్ప2తో తన క్రేజ్ మరింత పెంచుకోనున్నాడు.
Happy Birthday to the cuteness of my life . #alluarha #కందిరీగకథలు 😂 pic.twitter.com/83hQt0iKMn
— Allu Arjun (@alluarjun) November 21, 2022