Ali Basha : మరికొద్ది రోజులలో ఏపీలోను ఎన్నికలు జరగనుండగా, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వివిధ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుండగా, ఈ సామాజిక బస్సు యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్ని అన్ని వర్గాల ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసిన మంచి గురించి చెబుతూ తమ పార్టీ ఈ సారి కూడా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఏమైనా చేస్తానని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ అన్నారు.
మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజనీ పాల్గొన్నారు. అలానే ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహదారులు, సినీ నటుడు అలీ పాల్గొని జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇన్‌డైరెక్ట్‌గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకులు అనేదానికి మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. నేను జగన్ గారితో, వారి తండ్రిగారితో ప్రయాణం చేశాను. హైదరాబాద్ లో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉండే వాళ్లం. ఒకసారి వైఎస్సార్ గారు.. అలీ బాగున్నావా? అని అడిగారు. నాకేమి అన్న.. చాలా బాగున్నాను అని చెప్పాను.
సినిమాలో బాగానే ఉన్నావు.. రాజకీయాల్లో కూడా ఓ అడుగు వేయని తెలిపారు. అయితే నేను ఇంకా చిన్నవాడిని అన్నా.. టైమ్ వచ్చినప్పుడు తప్పక రాజకీయాల్లోకి వస్తానని తెలిపాను. అప్పుడు చెప్పాను.. ఆ టైమ్ 2019లో వచ్చి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. వైఎస్ జగన్ గారు పిలిచి.. నాతో ఉండు అన్నారు. అదే రోజు నేను జగన్ గారితో ఒక మాట చెప్పాను. జగనన్న నీకు కోసం ఏమైనా చేస్తాను. ఎంతదూరమైన వెళ్తాను అని చెప్పాను.వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడుని మరోసారి యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి” అని అలీ పేర్కొన్నారు. ఇదే సభలో చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు,మంత్రులు వివరించారు. ప్రస్తుతం అలా కామెంట్స్ వైరల్‌గా మారాయి.