Ali Basha : ప్రస్తుతం టాలీవుడ్‌లో పరాయి రాష్ట్ర భామల హవా ఎక్కువగా నడుస్తుంది. తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నా కూడా నిర్మాతలు వారిని పట్టించుకోవడం మానేశారు. కేవలం ఇతర రాష్ట్రాలకి సంబంధించిన వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అలానే వారి అడిగినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి తెలుగు సినిమాల్లో ఎక్కువగా నాన్ తెలుగు హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తుంటారు.ముఖ్యంగా ముంబై హీరోయిన్స్ ఎక్కువ కనిపిస్తారు నిజానికి అందరు ముంబై హీరోయిన్స్ అంటారు కానీ వారందరు ముంబై హీరోయిన్స్ కాదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నవారు.ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి అందరు ముంబైకి వచ్చి ఫ్యాషన్, మోడలింగ్, యాడ్ మేకింగ్ కోసం ముంబైకి వస్తారు.
ముంబైకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తుంటారు.ముంబై అనేది అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది.ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిలు ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు.ప్రతిఒక్కరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆడిషన్స్ జరిగినప్పుడు కచ్చితంగా సెలెక్ట్ కావాలని, వేరే విషయాలని పట్టించుకోకుండా మొత్తం ఫోకస్ ఆడిషన్ మీదే పెడతారు. మన తెలుగు హీరోయిన్లు కూడా కొంత మంది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి జెండా ఎగురవేసిన వారున్నారు.అప్పట్లో జయప్రద, శ్రీదేవి లు ముంబై వెళ్లి సంచలనాలు సృష్టించారు.
ముంబయి వాళ్లు ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు అని ముంబై హీరోయిన్స్ పై పలువురు కామెంట్స్ చేశారు. ఓ సందర్భంలో ఆలీ కూడా వారిపై మండిపడ్డారు. వారికి లగ్జరీ హోటల్స్ కావాలి, నచ్చిన హోటల్ లో ఫుడ్ తేవాలి. లేదంటే టేకులు ఎక్కువ తీసుకుంటారు, షూటింగ్ కి లేటుగా వస్తారు. దీని వలన నిర్మాతలకి చాలా నష్టం. అందుకే ఎందుకొచ్చిందిలే అని వారు అడిగిన వన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారంటూ ఆలీ అన్నారు. తను ఇలాంటివి చాలా చూసానని చెప్పిన ఆలీ.. హీరోలు అలా ప్రవర్తించరని కామెంట్ చేశాడు. ఆలీ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.