Akkineni Venkat : సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల కొద్ది వార్తలు హల్చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. అయితే కొద్ది రోజులుగా తన అన్న అక్కినేని వెంకట్ కి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయని,ఇద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవు అంటూ ఎప్పటినుండో ఒక వార్త నెట్టింట చక్కెర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే చాలామంది అక్కినేని నాగేశ్వరరావు కి నాగార్జున ఒక్కడే కొడుకు అని అనుకుంటారు.ఇక నాగార్జున సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఈయనే అందరికీ తెలుసు. వెంకట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
వెంకట్ సినీ పరిశ్రమలో నిర్మాతగా రాణించారు. ఆయన అప్పడప్పుడు మీడియాలో దర్శనమిస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా వెంకట్, నాగార్జునకి పడడం లేదు ఇద్దరి మధ్య వివాదం నెలకొందని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై అక్కినేని వెంకట్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.మా నాన్నగారి ముందు మేము ఏ రోజు కూడా మాట మాట్లాడే వాళ్ళం కాదు.ఏదైనా మాట్లాడితే చాలా భయపడే వాళ్లం. ఇక మా ఇద్దరినీ నాన్న ఇండస్ట్రీకి దూరంగా పెంచారు.కానీ నేనే ఒకరోజు నాన్న దగ్గరికి భయపడుతూనే వెళ్లి నాన్న నాగార్జునని హీరో చేద్దాం అని అన్నాను. దానికి నాన్న కూడాఏం మాట్లాడకుండా ఒప్పుకున్నారు.ఇక నాగార్జునకి నాకు మధ్య గొడవలు వచ్చాయి, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
నేను నాగార్జున ఇద్దరం కూడా ఇండస్ట్రీలో పెరగలేదు. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. అందువలన అప్పట్లో సినిమాలను గురించి మాకు ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన ఆలోచనలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేసేవారు కాదు. “నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. ఇప్పుడు నాగార్జున ఆ వ్యవహారాలు చూసుకుంటున్నాడు” అని చెప్పారు.