Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్‌ని అదృష్టం వరించడం లేదు. మంచి హిట్స్ అనేవి ఆయన చెంతకు రావడం లేదు. ఎంత కష్టపడుతున్నా కూడా హిట్ పలకరించడం లేదు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది. ఈ ఫ్లాప్‌తో అఖిల్ చాలా కుంగిపోయినట్టు తెలుస్తుంది. వరుస విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. పూర్తి నిరాశలో ఉన్న అఖిల్ బాధ నుండి బయటపడేందుకు. కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకున్నాడట. అందుకే ఒక్కడే దుబాయ్ ట్రిప్ కి వెళ్ళాడట. ఎయిర్ పోర్ట్ లో ఉన్న అఖిల్ ఫోటోలు బయటకు రాగా, ఆయన టూర్ కన్ఫర్మ్ చేశారు.
కొద్దిరోజుల పాటు దుబాయ్ లో అఖిల్ ఉంటాడని తెలుస్తుంది. అక్కడ నుండి వచ్చాక ఆయన కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినిపించాయి. ఈ సారి మాత్రం అఖిల్ చాలా ఆలోచించి మంచి దర్శకులని ఎంపిక చేసుకొని అద్భుతమైన కథతో సినిమా చేస్తాడని టాక్. కాగా, హీరోగా అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’. తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశారు. ఇవి మూడు డిజాస్టర్ అయ్యాయి. నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ అందుకున్నారు.
అయితే ఏజెంట్ ఫ్లాప్ గురించి తాజాగా నాగచైతన్య మాట్లాడుతూ.. అభిమానులకు మేము మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమకు మేము తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమానే. ఇటీవల మా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలకు మంచి రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్ లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే అని అన్నారు. అయితే ఈ టైం వెళ్ళిపోతుంది. తప్పకుండా మేము మళ్ళీ ప్రేక్షకులని అలరిస్తాము. మా ఫ్యాన్స్ ఆశించే ఫలితం కస్టడీ నుంచి రాబోతుందని నేను నమ్ముతున్నాను అని చైతూ కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…