Agent Movie : అక్కినేని ఫ్యామిలీ నుండి జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చిన హీరో అఖిల్. సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా, అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ కుర్ర హీరోకి మంచి సక్సెస్ లు అనేవి రావడం లేదు. ఎంతో కష్టపడి తాజాగా అఖిల్ అనే సినిమా చేయగా, ఈ మూవీ నిరాశపరచింది.అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు.
సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు. ఊర్వశీ రౌటేలా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ‘ఏజెంట్’ మూవీ ఓటీటీ డీల్ గురించి, స్ట్రీమింగ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ‘ఏజెంట్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే ఏప్రిల్ 28న విడుదలైన ‘ఏజెంట్’ మే చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.