Aishwarya Rajesh : గ్లామర్ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రధాన్యమున్న పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు మూడేళ్ల క్రితం వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది . తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సువర్ణ పాత్రలో జీవించింది. పైగా తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ బ్యూటీని ఎంతగానో ఆదరించారు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా నేషనల్ క్రష్ రష్మికపై సంచలన కామెంట్ చేసి వార్తలలో నిలిచింది.
ఐశ్వర్య రాజేష్ నటించిన `ఫర్హాన` సినిమా శుక్రవారం విడుదల కాగా, ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది ఐశ్వర్య. తెలుగు సినిమాలంటే, తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. అయితే తెలుగులో హీరోయిన్లు తెల్లగా సన్నగా, అందంగా ఉండాలని, గ్లామర్ షో చేయాలని, అలాంటి వారినే హీరోయిన్లుగా తీసుకుంటారని, మనకు సెట్ కాదులే అనే ఆలోచనతో ఉండిపోయిన సమయంలో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో నటించే అవకాశం తనకు దక్కిందని ఐశ్వర్యరాయ్ పేర్కొంది. చిత్రంలో తన పాత్ర కూడా తనలాగే డీ గ్లామర్‌గా ఉంటుందని, మొదట నా పాత్ర కనెక్ట్ కావడం కష్టమని భావించా. కానీ రిలీజ్ అయ్యాక సినిమా ఆడలేదు, కానీ నా పాత్రకి విశేషంగా ఆదరణ దక్కింది.
![Aishwarya Rajesh : రష్మిక పరువు తీసిన ఐశ్వర్య.. నాకే బాగా సెట్ అవుతుందంటూ కామెంట్..! Aishwarya Rajesh comments viral on rashmika mandanna](http://3.0.182.119/wp-content/uploads/2023/05/aishwarya-rajesh.jpg)
కౌసల్య కృష్ణమూర్తి` సినిమా సైతం పిల్లలకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యిందని, ఇక్కడ తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పడిందని చెప్పింది ఐశ్యర్య. `రిపబ్లిక్` సినిమా షూటింగ్ టైమ్‌లో చాలా మంది పిల్లలు తనని కలవడానికి వచ్చారని, కానీ అది తాను నమ్మలేదని అయితే కౌసల్య అక్క కోసమని అందరు అనడంతో నేను షాక్ అయ్యానంటూ ఐశ్వర్య పేర్కొంది. రానున్న రోజులలో మంచి పాత్రలతో కమ్ బ్యాక్ కావాలని ఉందని చెప్పింది. ఇక `పుష్ప` చిత్రం గురించి ప్రస్తావిస్తూ.. ఒకవేళ `పుష్ప` తనకు అవకాశం ఇచ్చి ఉంటే కచ్చితంగా చేసేదాన్ని అని చెప్పింది. ఇందులో రష్మిక మందన్నా అందంగా కనిపించారని, బాగా నటించారని, కాకపోతే శ్రీవల్లి పాత్ర నాకు బాగా సెట్ అవుతుందని ఆమె పేర్కొంది. పరోక్షంగా రష్మిక కంటే తనకే ఇది బాగా సెట్ అవుతుందని ఆమె చెప్పకనే చెప్పింది. ప్రేక్షకులు కూడా ఆమె చెప్పింది నిజమేనని అంటున్నారు.