Adisheshagiri Rao : గత కొద్ది రోజులుగా నరేష్ తెగ హంగామా చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పవిత్ర లోకేష్‌తో ఆయన చేస్తున్న హంగామా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. తమ రిలేషన్ షిప్‌ని, కృష్ణ, మహేష్ బాబు ఒప్పుకున్నట్టు కూడా కామెంట్స్ చేసారు. ఈ క్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో సినిమాలు చేసిన అతను ఇప్పుడు మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నట్టు ఆదిశేషగిరిరావు వెల్లడించారు.
ఇక పలు ఇంటర్వ్యూలలో మాట్లాడిన ఆయన సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడనని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. నరేష్ భార్య రమ్య ఇటీవల కృష్ణ చివరి రోజుల్లో ఆయనను ఒంటరిగా వదిలేశారని, కృష్ణను అనాథలా ఇంట్లోనే వదిలేశారంటూ చేసిన ఆరోపణలపై ఆదిశేషగిరిరావు బదులిస్తూ.. ‘‘అదంతా అబద్ధం అని అన్నారు. ఆరోజు రాత్రి మొత్తం మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. అతనితోపాటు మా మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే మహేష్ బాబు లేకపోతే ఎవరూ లేనట్టేనా దాని అర్థం అని అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందిన రోజు ఆయన పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించగా, గచ్చిబౌలి స్టేడియంలో అప్పుడు మంచు ఎక్కువగా పడుతుండటం.. ఆ మంచులో బయట కృష్ణ పార్థివదేహాన్ని ఉంచడం ఇష్టం లేక తీసుకెళ్లలేదని ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు. కాగా, మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రం విడుదల కానుండగా, దీని కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే మొదటి కౌబాయ్ మూవీగా రూపొందిన ఈ సినిమా 1971లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. సుమారు 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వబోతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…