Actress Vijaya Lakshmi : ఇటీవలి కాలంలో చాలా మంది పలు కారణాల వలన ఆత్మహత్యకు ప్రయత్నించడం మనం చూస్తూ ఉన్నాం. కొందరు పూటగడవక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరి కొందరు ఇతర కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటుండడం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్‌గా ఓ నటి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వీడియోను అప్లోడ్ చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. నేను ప్రజలకు అన్నీ చెబుతున్నాను, తన ఆత్మహత్యకు అతనే కారణం అంటూ కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి విజయలక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ రాజకీయ నాయకుడు, నటుడు, దర్శకుడు సీమాన్‌పై నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. సీమాన్ కారణంగా తాను ఏడు సార్లు గర్భం దాల్చానని ఇంతకు ముందే నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీ వ్యవస్థాపకుడు అయిన సీమాన్ మీద బహుబాష నటి గతంలో కూడా విజయలక్ష్మి అనేక ఆరోపణలు చేశారు. ఇప్పటికే తనకు సీమాన్ తో వివాహం జరిగిందని, ఆయన తనకు ఏడు సార్లు అబార్షన్ చేయించాడని గత కొంతకాలంగా నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న నటి విజయలక్ష్మి ఈ తరహా వీడియోలు చేసి ఆమెకు పరిచయం ఉన్న అందరిలోనూ ఆందోళన కలిగించింది.

నువ్వు కావాలి.. నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పాను కానీ అతను పట్టించుకోలేదు. నన్ను పెళ్లి చేసుకొని సీక్రెట్ గా ఉంచి.. నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదు అని రోడ్డున పడేశాడు. నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను కర్ణాటకలో బ్రతకలేకపోతునాన్ను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఇదే నా చివరి వీడియో..నా చావు పై సీమాన్ వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.