Actress Vasuki : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో తొలిప్రేమ ఒకటి. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా శుక్రవారం రీ-రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తొలిప్రేమ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డ్యాన్సులతో నానా సందడి చేశాడు. థియేటర్ల లోపల కూడా పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఓ థియేటర్ లో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేసింది.
ఇక తొలిప్రేమ రీరిలీజ్ సందర్భంగా చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన వాసుకి కూడా సందడి చేసింది. ఆమె సినిమా చూస్తున్నసమయంలో ఫ్యాన్స్ ఒకటే గోల చేశారు. తమిళ అమ్మాయి అయిన వాసుకి… ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకుంది.. ‘తొలి ప్రేమ’ సినిమా తరవాత వెండితెరపై మళ్లీ కనిపించలేదు. గృహిణిగా కుటుంబ బాగోగులు చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే, సుమారు 23 ఏళ్ల తరవాత మళ్లీ ఆమె ముఖానికి రంగు వేసుకున్నారు. ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాలో నటించారు. ఈసారి హీరోకి అక్క పాత్రలో నటించింది.
తొలిప్రేమ’ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని, వాటిలో తనకు నచ్చిన కథలు కూడా ఉన్నాయని, కానీ చేయడం కుదరలేదని వాసుకి చెప్పారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారని వాసుకి చెప్పారు. కూతురు హర్ష మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతోందని.. కొడుకు సందీప్ ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరంలో ఉన్నాడని ఆమె తెలిపారు. సినిమాలతో పాటు చదువుపై కూడా తాను దృష్టి పెట్టానని చెప్పిన వాసుకి.. ప్రస్తుతం సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నానని పేర్కొంది. ‘తొలిప్రేమ’ చేసినప్పుడు నాకు 18 ఏళ్లు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా, ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్లిపోతాం అని పేర్కొంది.
https://youtube.com/watch?v=ThcYFk-F0oQ