Actress Shiva Parvathi : టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో శివ పార్వతి ఒకరు. టాలీవుడ్ లో అనేక సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకి చేరువైంది. సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. గతంలో వదినమ్మ సీరియల్ చేస్తున్న సమయంలో ఆమె కరోనా బారిన పడడంతో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్న శివ పార్వతి ఇప్పుడు మాత్రం ఆఫర్స్ లేక ఖాళీగా ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
నాకు చాలా అవకాశాలు వచ్చి పోయాయి. బాలకృష్ణ సినిమాలో నటించాల్సి ఉండగా, పాతగా అయిపోయావని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆర్టిస్ట్‌లని పెద్దగా పట్టించుకోవడం లేదు. రంగనాథ్ గారు చనిపోవడానికి కారణం కూడా ఇదే అని శివ పార్వతి స్పష్టం చేసింది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మాకు అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అంటే పిచ్చెక్కిపోతుంది. కొందరికి బుల్లితెర అవకాశాలు అయిన వస్తున్నాయి. లేదంటే వందల మంది చనిపోయేవారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
![Actress Shiva Parvathi : అవకాశాలు లేక పిచ్చెక్కిపోతున్నాం.. రంగనాథ్ చనిపోయింది అందుకే అన్న సీనియర్ నటి.. Actress Shiva Parvathi sensational comments on ranganath](http://3.0.182.119/wp-content/uploads/2022/09/actress-shiva-parvathi.jpg)
ఇక రామానాయుడు, కృష్ణ, గోపాల కృష్ణ వంటి వారు నటీనటులని ప్రోత్సహించే వారు. నూతన్ ప్రసాద్ కి యాక్సిడెంట్‌లో కాళ్లు పోతే ఆయన కోసం సపరేట్‌గా పాత్రలు పుట్టించే వారు అంటూ శివ పార్వతి కామెంట్స్ చేసింది. కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సినిమా అవకాశాలు వచ్చిన సంతోషిస్తాం అని ఆమె పేర్కొంది.