Rohini : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో సముద్రఖని తెరకెక్కించిన చిత్రం బ్రో. ఈ సినిమా జూలై 28న విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో రోహిణి ముఖ్య పాత్రలో కనిపించిన సందడి చేశారు. రోహిణి.. నాని నటించిన అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఆమె డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాలకు పని చేశారు.. రోహిణి తెలుగులో ఒక్క విజయశాంతికి తప్ప అందరు హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు. సినీ నటుడు రఘువరన్‌ను 1996 లో వివాహం చేసుకున్న రోహిణి… ఆయన మరణం తర్వాత కుటుంబ భారాన్ని మోస్తూనే కొడుకును పెంచి పెద్ద చేశారు.
రోహిణి భర్త రఘువరన్ చాలా సినిమాలలో విలన్‌గా నటించి మెప్పించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో పవన్ తండ్రిగా అద్భుతంగా నటించి మెప్పించారు రఘువరన్. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గురించి రోహిణికి ఓ విషయం చెప్పారట రఘువరన్. ఆ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. సుస్వాగతం మొదటి రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రఘువరన్ ఇంటికి వచ్చి.. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య షూటింగ్ ఎలా జరిగిందో చెప్పారట.. పవన్ కళ్యాణ్ లో ఏదో మ్యాజిక్.. తెలియని మిరాకిల్ ఉందని ఆయన అన్నారట.
![Rohini : తొలిసారి పవన్ కళ్యాణ్‌తో నటించిన రోహిణి.. పవన్ గురించి మా ఆయన చెప్పింది నిజమే..! actress Rohini interesting comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/08/rohini.jpg)
అనంతరం వారిద్దరు కలిసి జానీ సినిమాలో నటించారు కూడా.. అప్పుడు కూడా రఘువరన్ పవన్ గురించి చెప్పేవారట.. అతను క్రేజీ బాయ్ అనేవారట. రఘువరన్ .. పవన్ గురించి చెప్తుంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి చూస్తుంటే రఘువరన్ చెప్పినా ఆనాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి అని అన్నారు రోహిణి. అతను చాలా సరదాగా ఉంటారు. ఆయన కళ్లలో ఒకవైబ్రేషన్ ఉంటుంది. సాయి ధరమ్ తేజ్‌తో షూటింగ్ సరదాగా గడిచింది అని చెప్పుకొచ్చింది రోహిణి.