Actress Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు సంప్రదాయబద్ధంగా కనిపించే ప్రగతి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు నడుస్తుంది. సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు.
తల్లి, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది ప్రగతి. తనదైన నటనతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది ప్రగతి. తెలుగులో దాదాపు 100కు పైగా సినిమాలలో నటించింది ప్రగతి. అలాగే తమిళంలో మరో 20 సినిమాలు.. మళయాళంలో కూడా రెండు సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా కూడా చేసింది ప్రగతి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియాలు, జిమ్ వీడియోలు చేస్తూ రచ్చ చేసిన ప్రగతి తన ఫ్యామిలీ పిక్స్ ఎక్కువగా ఎప్పుడూ షేర్ చేయలేదు.
![Actress Pragathi : ప్రగతి ఆంటీకి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటి.. నా సర్వస్వం నువ్వే అంటూ.. Actress Pragathi shared her daughter photo emotional](http://3.0.182.119/wp-content/uploads/2022/09/actress-pragathi-1.jpg)
అయితే ప్రగతికి ఓ ఎదిగిన కూతురు ఉంది. ఇటీవల ఆమెతో తెగ సందడి చేస్తుది. మొన్నటికి మొన్న కూతురితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన ప్రగతి.. రీసెంట్‌గా మరో గ్లామరస్ ఫోటో వదిలింది. డాటర్స్ డే సందర్భంగా కూతురిపై ఉన్న ప్రేమను బయటపెడుతూ ప్రగతి పోస్ట్ పెట్టింది. తన కూతురి చేతికి కిస్ ఇస్తున్న పిక్ షేర్ చేసింది ప్రగతి. దానికి నా ఆశ, నా బలం, నా నమ్మకం, నా గర్వం.. నా సర్వస్వం నువ్వే.. నీలాంటి కూతురు ఉన్నందుకు గర్విస్తున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ప్రగతి కూతురు విదేశాల్లో చదువుకుంటోందట. రానున్న రోజులలో ఆమెను హీరోయిన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.