Actress Pragathi : ఇటీవల చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. వారిలో ప్రగతి ఆంటీ ఒకరు. ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన ప్రగతి ఇటీవల మాత్రం అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ముఖ్యంగా జిమ్ వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
![Actress Pragathi : నటి ప్రగతి హీరోయిన్‌గా నటించిన సినిమా ఏదో తెలుసా..? Actress Pragathi acted as heroine in one movie do you know it](http://3.0.182.119/wp-content/uploads/2022/09/actress-pragathi.jpg)
నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తన యాక్టివిటీస్‌కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది. 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ప్రగతికి నటనపై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. అలా మొదట తమిళ నటుడు దర్శకుడు అయిన భాగ్యరాజా సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వీట్ల విశేశాంగ సినిమాతో ప్రగతి హీరోయిన్ గా తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె 7 తమిళ సినిమాలతోపాటు ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రగతి.. మహేష్ హీరోగా రూపొందిన బాబీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రగతి ఒక్కరోజు కాల్‌షీట్ కోసం దాదాపుగా రూ.50 నుంచి రూ.70 వేల వరకు డిమాండ్ చేస్తుందట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారవచ్చు.