Actress Hema : సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తవ్వినకొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇవి చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ రేవ్ పార్టీలో దాదాపు 100 మందికి పైగా రాజకీయ- సినిమా ప్రముఖులు దొరికినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వారిలో నటి హేమ పేరును కూడా పోలీసులు ప్రకటించారు. అయితే తాను ఆ రేవ్ పార్టీలో లేనని.. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి నటి హేమ మీద మరో కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి చాలానే పేర్లు బయటకు వస్తాయంటూ వార్తలు వస్తున్నాయి.
బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ ఉందా లేదా అనేది తీవ్ర చర్చనీయాశంగా మారుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. మొదట ఆ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరు పోలీసులు కూడా హేమ ఫోటోను విడుదల చేశారు. కానీ అదేమీ లేదంటూ హేమ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఆ వీడియోలో హేమ పేర్కొంది. అయితే హేమ విడుదల చేసిన ఫోటో.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లోనిదేనని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసలు హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లిందా లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే వీటన్నింటికి తెర దించుతూ తాజాగా బెంగళూరు కమిషనర్ ఒక ప్రకటన చేశారు. ఆ బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆమె రిలీజ్ చేసిన వీడియో లొకేషన్ ఎక్కడో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీ చాలా ఖరీదైందని.. ఇందులో 100 మందికిపైగా పాల్గొన్నారని చెప్పారు. అయితే ఇందులో ఎవరూ ప్రజా ప్రతినిధులు లేరని తేల్చి చెప్పారు. ఈ ఈవెంట్‌కు “సన్‌సెట్ టు సన్‌రైజ్” అని పేరు పెట్టాకున్నారని.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద వెల్లడించారు. కొందరు మోడల్స్, తెలుగు టీవీ యాక్టర్లు.. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీకి హాజరయ్యారని సీపీ దయానంద స్పష్టం చేశారు. ఆమె రిలీజ్ చేసిన వీడియో హేమకు లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో వల్ల ఆమెపై మరో కేసు నమోదు అయ్యింది. ఎందుకంటే ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉండి.. పోలీసులకు దొరికిపోయి.. పైగా తప్పుదోవ పట్టించేలా ఒక వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.